English | Telugu

సాయిపల్లవికి దక్కిన అరుదైన గౌరవం!

తమిళ చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అందించే అవార్డుల్లో కలైమామణి అత్యున్నత పురస్కారంగా చెప్పొచ్చు. ఈ అవార్డు అందుకోవడం అనేది కళాకారుల కల. ఎన్నో సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందిస్తోంది. తాజాగా 2021 నుంచి 2023 వరకు మూడు సంవత్సరాల పురస్కారాలను ప్రకటించింది ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 30 అవార్డులను అందిస్తారు. ఆవిధంగా మూడు సంవత్సరాలకు కలిపి మొత్తం 90 మంది ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు.

2021 సంవత్సరానికి సాయిపల్లవి, నటుడు ఎస్‌.జె.సూర్యలను ఎంపిక చేశారు. సినీ సంగీతంలో కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తున్న అనిరుధ్‌ రవిచందర్‌కు 2023 సంవత్సరానికి కలైమామణి అవార్డు దక్కింది. జాతీయ విభాగంలో భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన కె.జె.ఏసుదాస్‌కు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాలను అక్టోబర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో కళాకాకారులకు ప్రదానం చేస్తారు. చెన్నయ్‌లో జరిగే ఈ వేడుకకు సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా హాజరవుతారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.