English | Telugu
అమృతగాయని ఎస్ జానకి బర్త్ డే ఈరోజు..!
Updated : Apr 23, 2016
ఆ ఒక్క గొంతులో వేయి భావాలు పలుకుతాయి. మధురం అన్న పదానికి పర్యాయపదం ఆమె పాట. ఆ గొంతులోనే మలయమారుతంలాంటి పాట వినిపిస్తుంది. ఝంఝామారుతం లాంటి పాట జాలువారుతుంది. గంగా ప్రవాహంలా సాగే ఆ అమృత ఝరిలో దశాబ్దాల పాటు ఎంతోమంది అభిమానులు ఓలలాడారు. తమ గానార్తిని తీర్చుకున్నారు. తన గంథర్వ స్వరంతో పాటకే వన్నె తెచ్చిన ఆ గాయని ఎస్. జానకమ్మ. ఈరోజు ఈ దేవగంథర్వగాయని పుట్టిన రోజు. ఆమె పాడిన ప్రతీపాటా ఆణిముత్యమే అయినా, మచ్చుకు కొన్ని పాటల్ని చూసే ప్రయత్నం చేద్దామా..!
1. సిరిమల్లె పువ్వా..(పదహారేళ్ల వయస్సు)
2. నరుడా ఓ నరుడా (భైరవ ద్వీపం)
3. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (రాక్షసుడు)
4. మౌనమేలనోయి ఈ మరపురాని హాయి (సాగరసంగమం)
5. ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన)
6. మగధీర (ఒకే ఒక్కడు)
7. వెన్నెల్లో గోదారి అందం (సితార)
8. ఆకాశంలో ఆశల హరివిల్లు (స్వర్ణ కమలం)
9. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (మంచి మనసులు)
10. అంజలి అంజలి అంజలి (అంజలి)