English | Telugu

ఆ విషయంలో తగ్గేదేలే.. దటీజ్ రుక్మిణి వసంత్ 

సప్త సాగరాలు ధాటి సైడ్ ఏ, సైడ్ బి చిత్రాల్లో 'ప్రియ' అనే క్యారక్టర్ లో అద్బుతంగా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న కన్నడ హీరోయిన్ 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth). ఆ తర్వాత బఘిర, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, ఏసిఈ వంటి చిత్రాల్లో నటించింది. ఆ మూడు చిత్రాల రిజల్ట్ తో సంబంధం లేకుండానే రుక్మిణి పెర్ఫార్మెన్సు కి మంచి పేరు రావడంతో, పలు భాషల్లో వరుస ఆఫర్స్ రుక్మిణి కి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శివకార్తికేయన్, మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న'మద్రాసి'(Madrasi)అనే చిత్రంలో చేస్తుంది.

దీంతో పాటు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో తెరకెక్కుతున్నపాన్ ఇండియా మూవీలో కూడా రుక్మిణి నే హీరోయిన్. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించకపోయినా, ఇప్పటికే రుక్మిణి పై కొన్నికీలక సన్నివేశాలని చిత్రీకరించారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. ఈ మూవీకి సంబంధించి రుక్మిణి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఆమె తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. నిఖిల్ తో చేసిన' అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీలో చేసినా, ఆ మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులకి తెలియని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్ మూవీలో అవకాశం అంటే ఈ హీరోయిన్ అయినా రెమ్యునరేషన్ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా, నటించడానికి ఒప్పుకుంటుంది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటు కోటిన్నర తీసుకుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది. మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడం రుక్మిణి ఉన్న క్రేజ్ కి ఉదాహరణ అని చెప్పవచ్చు.

ఇక ఈ మూవీకి'డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ డాన్స్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఒక ప్రత్యేక గీతాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక, కేతిక శర్మ పేర్లని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2026 జూన్ 25 న ఈ క్రేజీ ప్రాజెక్జ్ విడుదల కానుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.