English | Telugu
రుద్రమదేవి..ఇంకా డిసైడ్ కాలే
Updated : Jun 16, 2015
గుణశేఖర్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. సమ్మర్‌లో రావల్సిన రుద్రమదేవి... జూన్ ముగుస్తున్నా రాలేదు. జూన్ 26న వచ్చేస్తున్నామని గుణశేఖర్ ప్రకటించినా.. అందుకు సంబంధించిన హడావుడి ఏమీ లేదు. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ప్రచారం ఏ రేంజులో ఉండాలి..??
పట్టుమని చూస్తే ఇంకో పది రోజులు కూడా లేదాయె. అలాంటప్పుడు రుద్రమదేవి ఏ రేంజులో పబ్లిసిటీ చేసుకోవాలి. అయితే గుణశేఖర్ మాత్రం కామ్‌గా ఉన్నాడు. ఇంత వరకూ చూపించింది ఒక్క ట్రైలరే. అదీ.. తేలిపోయింది. మరో ట్రైలర్ విడుదల చేయలేదు. మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటని ఆరాతీస్తే.. బయ్యర్లు ఎవరూ ఈ సినిమాపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
రుద్రమదేవి రిలీజ్ డేట్ ప్రకటించగానే ఈసినిమా రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని గుణశేఖర్ భావించాడు. అయితే వాళ్ల నుంచి స్పందన లేదు. ఆది, సోమ వారాలు బయ్యర్లతో గుణశేఖర్ మీటింగులు పెట్టాడు. అయితే అవేం ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. వీలైనంత త్వరగా విడుదల తేదీపై గుణశేఖర్ ఓ స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జూనఖ 26న గనుక రుద్రమదేవి రాకపోతే... ఇక ఇప్పట్లో అనుష్క సాహసాల్ని వెండితెరపై చూడలేం.