English | Telugu

టాలీవుడ్ పండగ మొదలైంది

బాహుబలి.. శ్రీమంతుడు కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ సినిమాలన్నీ విడుదలకు సిద్డంవుతున్నాయి. థియేటర్ల కొరత కూడా లేకపోవడంతో మిగతా సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. మొదట ఈ నెల 21న రవితేజ కిక్2 తో వస్తున్నాడు. దీని తర్వాత రుద్రమదేవి సెప్టెంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కానుంది ఆ తర్వాత సెప్టెంబర్ 17న శివం విడుదల కానుండగా అదే నెల 24న సుబ్రమణ్యం ఫర్ సేల్ థియేటర్ల లోకి రానుంది.

అనుష్క నటించిన సైజ్ జీరో వరుణ్ తేజ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న కంచె... అక్టోబర్ 2 న పోటీపడనున్నాయి. మంచు విష్ణు డైనమైట్ కూడా అక్టోబర్ 1నే అని ఫిక్సయ్యాడు. ఇక దసరా సీజన్ కోసం పెద్ద సినిమాలే సిద్ధమవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్- శ్రీనువైట్ల మూవీ అక్టోబర్ 15న థియేటర్లకు వస్తుండగా.. అక్టోబర్ 21న అక్కినేని అఖిల్ నటించిన ఫ్యాన్స్ కు ముందుకు రాబోతోంది. ఇప్పటికైతే షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక తేలాల్సింది ఈ సినిమాలు అంచనాలు అందుకుంటాయా లేదా అనే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.