English | Telugu
అనుష్క బర్త్ డేకి ‘రుద్రమదేవి' గిఫ్ట్
Updated : Nov 7, 2014
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. గత ఏడాది అనుష్క పుట్టినరోజున ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సారి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో అనుష్క ఫైట్స్ ప్రాక్టీసు, కొన్ని ఒరిజినల్ సీన్స్ తాలుకూ షూటింగ్స్ మాత్రమే కనిపించాయి. ఈ వీడియోలో రానా, అల్లుఅర్జున్‌లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఇందులో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, సుమన్, కెథరిన్ వంటి భారీ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.