English | Telugu

'ఆర్​ఆర్ఆర్​' సంచలనం​.. ఏకైక ఇండియన్​ సినిమాగా రికార్డు

'ఆర్​ఆర్ఆర్​' సంచలనం​.. ఏకైక ఇండియన్​ సినిమాగా రికార్డు

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మార్చి 25 న విడుదలైన మూవీ ఇప్పటికే రూ.938 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి దూసుకుపోతోంది. త్వరలోనే 1000 కోట్ల మార్క్ అందుకోనున్న ఆర్ఆర్ఆర్ మరో సంచలనం సృష్టించింది.

ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ(ఐఎండీబీ)లో మోస్ట్​ పాపులర్​ లిస్ట్​ లో ఆర్ఆర్ఆర్ చోటు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్​-5 సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఐదో స్థానంలో నిలవడం విశేషం. దీంతో టాప్​-5 లో చోటు దక్కించుకున్న ఏకైక ఇండియన్ సినిమాగా సంచలనం సృష్టించింది. అలాగే ఐఎండీబీ రేటింగ్ పరంగానూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ప్రస్తుతం 9 రేటింగ్ తో నాలుగో స్థానంలో నిలిచింది.

బడా బడా హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి మోస్ట్​ పాపులర్​ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ ఐదో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది.

'ఆర్​ఆర్ఆర్​' సంచలనం​.. ఏకైక ఇండియన్​ సినిమాగా రికార్డు

'ఆర్​ఆర్ఆర్​' సంచలనం​.. ఏకైక ఇండియన్​ సినిమాగా రికార్డు