English | Telugu
100 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ లో 'ఆర్ఆర్ఆర్' స్థానమిదే..!
Updated : Jun 17, 2025
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' (RRR) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2022లో విడుదలైన ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ రాబట్టింది. గ్లోబల్ స్థాయిలో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది.
ఇండీవైర్ అనే ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ 2020లలో ఇప్పటిదాకా వచ్చిన వంద ఉత్తమ చిత్రాల లిస్టుని ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్.. 75వ స్థానాన్ని సంపాదించుకుంది. మొదటి మూడు స్థానాల్లో 'నికెల్ బాయ్స్', 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ఆఫ్టర్ సన్' చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఏడో స్థానంలో 'టాప్ గన్: మావెరిక్', 54వ స్థానంలో 'ఓపెన్‌హైమర్', 58వ స్థానంలో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' నిలిచాయి.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్ తో మరోసారి గ్లోబల్ వైడ్ గా రాజమౌళి పేరు మారుమోగిపోవడం ఖాయమని చెప్పవచ్చు.
