English | Telugu

డిసెంబర్ 22 న "బిజినెస్ మ్యాన్" ఆడియో

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తూ, దర్శకత్వం వహిస్తూండగా, మనసున్న మంచి నిర్మాత డాక్టర్ వెంకట్‍ ప్రతిష్టాత్మక చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం డిసెంబర్ 2 వ తేదీ నుండి 10 వ తేదీ వరకూ హైదరాబాద్ లో ప్యాచ్ వర్క్ జరుపుకుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటున్న "బిజినెస్ మ్యాన్" చిత్రానికి ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ కూడా ప్రారంభమైంది.

ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియోని డిసెంబర్ 22 వ తేదీన తేలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్ ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. శ్యాం.కె.నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని, విజయ్ ఫైట్స్ నీ నిర్వహిస్తున్నారు. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం కోసం తొలిసారి హీరో మహేష్ బాబు ఒక థీమ్ సాంగ్ ని పాడటం విశేషం. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం జనవరి 13 వ తేదీన సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కానుంది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.