English | Telugu

బ్రేకింగ్‌.. హర్షసాయి కేసులో శేఖర్‌బాషా అరెస్ట్‌!

యూ ట్యూబ్‌లో ఎంతో పాపులర్‌ అయిన హర్షసాయిపై బిగ్‌బాస్‌ ఫేమ్‌ మిత్రాశర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించాడని, రేప్‌ చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షసాయిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మిత్రశర్మ తాజాగా ఆర్‌.జె. శేఖర్‌బాషాపై కూడా ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేశారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. ప్రస్తుతం సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌లోనే ఉన్నారు శేఖర్‌ బాషా. పోలీసులు అతన్ని మూడు గంటలుగా విచారిస్తున్నారు. మిత్రశర్మపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు శేఖర్‌ భాషాపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.

హర్షసాయి విషయానికి వస్తే.. తనను రేప్‌ చేయడమే కాకుండా నగ్నవీడియోలు తీసి తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మిత్రశర్మ పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నప్పటికీ హర్షసాయిని ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు. అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. అతను పరారీలో ఉన్నాడని భావిస్తున్నారు. ఈలోగా పలువురు యూట్యూబర్లచేత మిత్రశర్మపై దుశ్ప్రచారం చేయిస్తున్నాడనే ఆరోపణలు కూడా హర్షసాయిపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ తాజా సీజన్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శేఖర్‌ బాషా కొద్దిరోజుల్లోనే బయటకు వచ్చేయడం గమనించాల్సిన విషయం.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.