Read more!

English | Telugu

ఉదయం లేవగానే బ్లూ ఫిలిమ్స్ చూస్తున్న వర్మ..!

"మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలయ్య" అని దివంగత నటులు రావుగోపాల్రావు చెప్పిన డైలాగ్ ను.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రాంగోపాల్ వర్మ బాగా ఫాలో అవుతున్నట్లున్నాడు. అయితే ఈయన కళాపోషణ ఏంటనే విషయం తెలిస్తే "హవ్వా" అనుకోకమానరు. ఏ మనిషైనా ఉదయం లేవగానే కాఫీ తాగుతాడు లేక పేపర్ చదువుతాడు, లేదంటే కాసేపు చల్లని గాలిని ఆస్వాదిస్తాడు. కానీ.. మహారాజశ్రీ వర్మ గారికి పొద్దున లేచినవెంటనే ఒక పదిహేను నిమిషాలపాటు "పోర్న్ మూవీస్" (బ్లూ ఫిలిమ్స్) చూడకపోతే తోచదట. ఆఖరికి రాత్రంతా ఒకమ్మాయితో శృంగారం జరిపిన తర్వాత, పొద్దున్న లేచేసరికి ఆ అమ్మాయి పక్కలో ఉన్నప్పటికీ.. వర్మగారి దినచర్యలో మాత్రం అస్సలు మార్పు ఉండదట. ఈ విషయాన్ని స్వయంగా వర్మే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా.. తనకు కనిపించే ప్రతి అమ్మాయిని "ఆ" కోణంలోనే చూస్తాడట. ఆ అమ్మాయికి ఎక్కడ ఉండాల్సినవి అక్కడ సరిగా, చూడదగిన విధంగా లేకపోతే అసలా అమ్మాయిని అమ్మాయిలా చూడడట. ఇలా వర్మగారు సెక్స్ గురించి, తన సెక్స్ పర్వెర్షన్స్ గురించి చాలా చెప్పాడు. చూస్తుంటే.. ఇప్పటివరకూ వచ్చిన వర్మ ఇంటర్వ్యూల కంటే ఈ తాజా ఇంటర్వ్యూ ఇంకాస్త ఎక్కువగా హడావుడి చేసేలా ఉంది!