Read more!

English | Telugu

మీడియాకి స్టేట్ మెంట్ ఇచ్చిన అనుష్క..!


ఈమధ్య బాలీవుడ్ హీరోయిన్ ఏమాత్రం అవకాశం ఉన్నా హాలీవుడ్ కి ఎగిరిపోదామని అవకాశం కోసం కాచుకొని ఉన్నారు. గెస్ట్ రోల్స్ ఆఫర్స్ వచ్చినా వదలట్లేదు. అలాంటిది బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న అనుష్క శర్మ మాత్రం తనకు హాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తోంది. ఇటీవల "సుల్తాన్" సినిమా ప్రమోషన్ కోసం మీడియాతో ముచ్చటించిన అనుష్క ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇకపోతే.. అనుష్క శర్మ తన ప్రియుడు విరాట్ తో మళ్ళీ ప్యాచప్ అయిపోయిందని బాలీవుడ్ మీడియా చెవులు కోరుక్కుంటుంది. అనుష్క కూడా ఈ విషయమై సమాధానం చెప్పకపోవడం అందుకు ఆజ్యం పోసింది. విరాట్ ను వదిలి వెళ్లలేకే హాలీవుడ్ ఆఫర్లాంటే ఇష్టం లేదని చెబుతుందేమో ఈ బాలీవుడ్ సుందరీమణి!