Read more!

English | Telugu

రెజీనాతో బికినీ వేయిస్తున్న కృష్ణవంశీ...!

నటనతోపాటు గ్లామర్ డోస్ ను కూడా సమపాళ్లలో మెయింటైన్ చేస్తూ నిన్నమొన్నటివరకూ కెరీర్ ను నెట్టుకుంటూ వచ్చింది రెజీనా. ఆ తర్వాత "శౌర్య, సౌఖ్యం" సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో అమ్మడీకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో మళ్ళీ తన పుట్టిళ్ళైన తమిళనాడుకు పయనమై అక్కడ ఓ హారర్ సినిమాలో నటిస్తోంది. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న "నక్షత్రం" చిత్రంలో.. సందీప్ రిఫరెన్స్ తో కథానాయికగా ఎంపికైంది. సాధారణంగానే హీరోయిన్లలు మాంచి హాట్ గా చూపించే కృష్ణవంశీ రెజీనాను కూడా అదే స్థాయిలో పిక్చరైజ్ చేయనున్నాడట. ఈ సినిమాలో ఒక పాట కోసం రెజీనాను బికినీ వేయవలసిందిగా కోరాడట. అసలే అవకాశాల్లేక బాధపడుతున్న అమ్మడు.. మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పేసుకొందట. సో, "నక్షత్రం" చిత్రంలో రాజీనా బికినీ అందాలను కృష్ణవంశీ స్టైల్ లో చూసేయోచ్చన్నమాట!