English | Telugu

హత్య చేసిన ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చేశారు!

ఎంతటి నేరం చేసినా తమకు ఉన్న పలుకుబడితో తిమ్మిని బమ్మిని చేసి శిక్ష నుంచి తప్పించుకునేందుకు రకరకాల మాయలు చేస్తుంటారు డబ్బున్నవాళ్ళు. ఒక హత్య కేసులో బెయిల్‌ రావడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ హత్య కేసులో ప్రధాన నిందితులైన ప్రియుడు, ప్రియురాలు బెయిల్‌పై బయటికి వచ్చేసి జనంతో కలిసి తిరుగుతున్నారు. ఇలాంటివి మనదేశంలోనే సాధ్యమవుతాయి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు, యావత్‌ భారతదేశాన్ని కుదిపేసిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌, అతని ప్రియురాలు పవిత్రగౌడతోపాటు 15 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దర్శన్‌కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అతని వెన్నుకు ఆపరేషన్‌ చేయాల్సి ఉందని అతని తరఫు న్యాయవాది ఒక పిటిషన్‌ పెట్టడంతో దర్శన్‌కు ఇటీవల బెయిల్‌ మంజూరు చేశారు. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే దర్శన్‌ మాత్రం ఏవో కారణాలు చెబుతూ ఇప్పటివరకు ఆపరేషన్‌ చేయించుకోలేదు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ హత్య కేసులో ప్రధాన ముద్దాయి పవిత్రగౌడకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె జైలు నుంచి బయటికి రాగానే తన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులతో కలిసి వజ్రమునేశ్వర ఆలయానికి పవిత్రంగా వెళ్లి దర్శన్‌ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ప్రత్యేక పూజలు చేయించింది. ఇంతటి సంచలనం సృష్టించి ఈ హత్య కేసులో ప్రధాన నిందితులకు బెయిల్‌ ఇవ్వడానికి అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్య చేశారని స్పష్టమైన ఆధారాలు పోలీసులు సమర్పించారు. మరి వారికి బెయిల్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.