Read more!

English | Telugu

డిఫరెంట్ గెటప్ లో విలన్ గా రాజశేఖర్...!

గతేడాది రాజశేఖర్ విలన్ గా తేజ దర్శకత్వంలో "అహం" అనే సినిమా సెట్స్ కు త్వరలో వెళుతున్నట్లు వార్తలొచ్చాయి. దర్శకుడు తేజ, రాజశేఖర్ కూడా సదరు వార్తలు నిజమే అని పేర్కొన్నారు. ఏమయ్యిందో తెలియదు గానీ.. ఉన్నట్లుండి ఆ ప్రొజెక్ట్ అటకెక్కింది. ప్రస్తుతం రాణా-కాజల్ జంటగా ఒక సినిమా తెరకెక్కించే పనిలో పడిపోయాడు తేజ. దాంతో విలన్ గా రాజశేఖర్ ఎంట్రీ ఇప్పుడప్పుడే ఉండదనుకొన్నారందరూ. ఉన్నట్లుండి మళ్ళీ రాజశేఖర్ పేరు ప్రతినాయకుడిగా వినిపిస్తోంది. "డిక్టేటర్" అనంతరం గోపీచంద్ హీరోగా ఒక సినిమా ఎనౌన్స్ చేసిన దర్శకుడు శ్రీవాస్.. ఆ సినిమాలో విలన్ గా రాజశేఖర్ ను ఎంపిక చేసుకొన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది. ఈ సినిమా కోసం రాజశేఖర్ ఇప్పటివరకూ ట్రై చేయని ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడట!