English | Telugu

బెంగాల్ టైగర్ కి రిపేర్లు..!!

మాస్ మహరాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ దీపావళి రేస్ నుంచి తప్పుకుంది. నవంబర్ 5 థియేటర్లలో సందడి చేయాల్సిన సినిమా సడన్ గా వాయిదా పడింది. ఒకేసారి మూడు వారాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా అవుట్ పుట్ రవితేజ అంచనాలను అందుకోలేకపోవడమే అసలు కారణం అని సమాచారం. అందుకని ఈ సినిమాలో కొన్ని సీన్లను రిపేర్లు చేయమని సూచించాడట. అందుకని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రవితేజకు సంబంధించిన షాట్స్‌ను రీ షూట్‌ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దాని కోసం వారం రోజులు చిత్ర యూనిట్ ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నారట. అదీ అసలు సంగతి. మొత్తానికి బెంగాల్ టైగర్ ఈ నెలలో రిలీజయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.