English | Telugu

'బెంగాల్ టైగర్' భలే ఆఫరిచ్చాడు

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైన భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలై మోత మోగిస్తున్నాయి. ఈ ఆడియోలో అన్ని పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

ఈ ఆడియోకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి ఈ చిత్ర సాంగ్స్ కాంటెస్ట్ ను నిర్వహించబోతున్నారు దర్శకనిర్మాతలు. నవంబర్ 30న ఈ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ... మా సినిమా ఆడియోలోని రెండు సాంగ్స్ ఛార్ట్ బస్టర్ లో నిలిచాయి. ఆడియోను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. అందుకే ‘బెంగాల్ టైగర్ సాంగ్స్ కాంటెస్ట్’ ను నిర్వహిస్తున్నాం. ఇందులోని 5 పాటలలో ఏదో ఒక పాట చరణం లేదా పల్లవి పాడి, ఆ వివరాలను సౌండ్ క్లౌడ్.కామ్ కు వారి వివరాలను జతచేసి పంపాలి. అలా పంపిన వారిలో ముగ్గురికి ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తాం. అంతేకాకుండా ఆ ముగ్గురిలో బెస్ట్ సింగర్ కు మా బ్యానర్ లో వచ్చే తర్వాతీ సినిమాలో పాడే అవకాశం కలిపిస్తాం. ఈ కాంటెస్ట్ నవంబర్21 నుంచి నవంబర్ 28 వరకు వుంటుంది అని చెప్పుకొచ్చారు.

రవితేజ, తమన్నా, రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి సంప‌త్‌నంది ద‌ర్శక‌త్వం వహించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.రాధామోహ‌న్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్, లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.