English | Telugu

‘బాహుబలి’లో శివగామిగా శ్రీదేవి.. షాక్‌ అయిన రమ్యకృష్ణ!

నటి రమ్యకృష్ణ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. అయితే వాటిలో శివగామి క్యారెక్టర్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఒక విధంగా హీరోకి ధీటుగా నిలిచే క్యారెక్టర్‌ అది. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు రమ్యకృష్ణ. అయితే బాహుబలి చిత్రంలోని శివగామి క్యారెక్టర్‌ కోసం శ్రీదేవిని సంప్రదించారని, ఆ తర్వాతే రమ్యకృష్ణను తీసుకున్నారనే వార్త అప్పట్లో ప్రచారంలో ఉండేది. ఇప్పుడు బాహుబలి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్‌’ పేరుతో రీరిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 31న ఈ సినిమా రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో శ్రీదేవి ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు బాహుబలి నుంచి శ్రీదేవిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే విషయం గురించి చెప్పాల్సి వస్తే.. దీని గురించి శ్రీదేవి, రాజమౌళి భిన్నంగా స్పందించడం విచిత్రంగా అనిపిస్తుంది.

బాహుబలి మొదటి భాగం రిలీజ్‌ అయిన తర్వాత ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దగ్గర ఈ ప్రస్తావన వచ్చినపుడు.. శ్రీదేవిని శివగామిగా తీసుకోవాలని అనుకున్న మాట వాస్తవమే అన్నారు. అయితే ఆమె రెమ్యునరేషన్‌ ఎక్కువ అడగడం, తన అసిస్టెంట్స్‌కి కూడా ఫ్లైట్‌ టికెట్స్‌ వేయమనడం, హోటల్‌లో ఒక ఫ్లోర్‌ మొత్తం తనకు కేటాయించాలని చెప్పడం వంటి కారణాల వల్ల ఆమెను కాదని రమ్యకృష్ణను తీసుకున్నామని చెప్పారు రాజమౌళి.

ఈ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మరో ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు శ్రీదేవి. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘బాహుబలిలో నన్ను శివగామిగా నటించమని అడిగిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత రాజమౌళి నాతో మాట్లాడలేదు. నాతో మాట్లాడకుండానే ఆయన అలా ఆరోపణ చేయడం బాధ కలిగించింది. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఏరోజూ నాపై ఇలాంటి కంప్లయింట్‌ రాలేదు. నేను అలా డిమాండ్‌ చేసే దాన్నయితే హీరోయిన్‌గా అన్ని సినిమాలు చేయగలిగేదాన్ని కాదు. ఇది రాజమౌళి మేనేజర్‌, మా మేనేజర్‌ మధ్య జరిగిన వ్యవహారంగానే నేను భావిస్తున్నాను’ అన్నారు శ్రీదేవి.

ఇప్పుడు ఈ వార్త మరోసారి ఎందుకు బయటికి వచ్చిదంటే.. నటుడు జగపతిబాబు జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా పేరుతో ఒక షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రమ్యకృష్ణ, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ షోలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే ‘బాహుబలిలో శివగామి క్యారెక్టర్‌ కోసం మొదట శ్రీదేవిని అనుకున్నారు. అది నువ్వు చేశావు. ఈ విషయం నీకు తెలుసా?’ అని రమ్యకృష్ణను అడిగారు జగపతిబాబు. దానికి రమ్యకృష్ణ షాక్‌ అయింది. అసలు ఆ విషయం గురించి మీరు చెప్పే వరకు తనకు తెలియదన్నారు. అయితే ఆ క్యారెక్టర్‌ చేయడం తన అదృష్టం అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.