English | Telugu

రామాయణంలో ఎవరు సెట్టవుతారో తెలుసా..?

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సినిమాల కథలన్నీ రామాయణ మహాభారతాల నుంచి పుట్టినవే. ముఖ్యంగా హీరోయిన్ పై విలన్ మోజు పడటం, వాడిని చితగ్గొట్టి హీరో హీరోయిన్ న దక్కించుకోవడమనేది తెలుగు సినిమా చరిత్ర మొదలైనప్పటి నుంచీ వస్తున్నదే. ఇది పూర్తిగా రామాయణం నుంచి తీసుకున్న కాన్సెప్టే. ఇదే కాక, ఒక్క హీరో వంద మంది విలన్లను మట్టి కరిపించడమనేది, పంచపాండవులు, వంద మంది కౌరవుల్ని మట్టి కరిపించిన మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇలా తెలుగు సినిమాకు మన పురాణాలకు విడదీయలేని అనుబంధముంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా, రామాయణాన్ని సినిమాగా తీస్తే, ఇప్పుడున్న వాళ్లలో ఎవరు సెట్టవుతారు అన్న దానిపై సరదాగా ఓ లుక్కేద్దాం రండి.


రాముడు :

రాముడంటే గుర్తొచ్చేది అన్న ఎన్టీఆరే. ఇప్పుడున్న వాళ్లలో రాముడిగా వేయాలంటే, ఆయన మనవడు చిన్న తారక రాముడే కరెక్ట్ కదా. ఇప్పటికే బాలల రామాయణంలో రాముడిగా మెప్పించాడు కూడా..

సీత :

ఆల్రెడీ నయనతార సీతగా మెప్పించేసింది. ఒక వేళ నయనతార కాకుండా చూస్తే మాత్రం నిత్యామీనన్ కరెక్ట్ గా సెట్టవుతుంది. బాహుబలి చూసిన తర్వాత, అనుష్క కూడా అశోకవనంలో సీతగా సూపర్ గా సెట్ అవుతుందని అనిపించకమానదు.

రావణాసురుడు :

భల్లాలదేవుడిగా అదరగొట్టిన రానా, రావణాసురుడి పాత్రకు పెర్ఫెక్ట్ సూట్..

లక్ష్మణుడు :

రాముడిగా ఎన్టీఆర్ చేస్తే,పక్కన లక్ష్మణుడిగా ఇప్పుడున్న హీరోల్లో కరెక్ట్ గా సెట్ అవుతాడు నాగచైతన్య. కొద్దిగా ఒళ్లు చేస్తే, అఖిల్ కూడా పెర్ఫెక్ట్ గా సింక్ అవుతాడు.

హనుమంతుడు :

స్ట్రాంగ్ బాడీ అండ్ యాక్టివ్ నెస్ లో మంచు మనోజ్ పెర్ఫెక్ట్.

దశరథుడు :

నాజర్..మరో మాట లేదు.

మరీ ఇన్ డెప్త్ గా వెళ్తే, జనకుడు, భరత శత్రుఘ్నులు, విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి కీలకపాత్రలు చాలానే ఉన్నాయి. కేవలం మెయిన్ పాత్రల వరకూ ఎవరెవరుంటే బాగుంటుంది అని సరదాగా ఈ ప్రయత్నం. జస్ట్ గెస్సింగ్ గేమ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.