English | Telugu

వర్మ వీడియో రిలీజ్..వారం రోజుల్లో మర్డర్ కేసు తేలుస్తారా 

చంద్రబాబునాయుడు(chandrababu naidu)పవన్ కళ్యాణ్(pawan kalyan)లోకేష్(lokesh)పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ లు చేసినందుకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పై పోలీసు కేసు నమోదయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో పరారిలో ఉన్న వర్మకి టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ఆశ్రయమిచ్చినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వర్మ రీసెంట్ గా ఒక వీడియో విడుదల చేసాడు.

అందులో వర్మ మాట్లాడుతూ 'నేను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నానని మీడియాలో స్ప్రెడ్ అవుతుంది.అందుకే ఈ వీడియో చేస్తున్నాను.నేను వన్ ఇయర్ క్రితం ట్వీట్స్ చేస్తే వారం రోజుల క్రితం నలుగురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతినయ్యాని,నలుగురు వ్యక్తులు నాలుగు డిఫరెంట్ ప్లేసులకి చెందిన పోలీసుస్టేషన్లో నా మీద కేసు పెట్టడం జరిగింది నేను ఎవరి మీదయితే ట్వీట్లు చేసానో,వాళ్ళు నా మీద కేసు పెట్టకుండా ఎవరో థర్డ్ పార్టీ నా మీద కేసు పెట్టింది.

కాబట్టి నా మీద కేసు ఎలా చెల్లుతుంది. ఈ విషయంలో నేను పొలిటికల్ పర్సన్స్ ని గాని, పోలీసులని గాని బ్లేమ్ చెయ్యటం లేదు. షూటింగ్ పనుల వలన పోలీసులని కలవలేకపోతున్నాను.సంవత్సరం క్రితం చేసిన ట్వీట్ చూసిన వాళ్ళకి వారం రోజుల్లోనే అన్ని అయిపోవాలంటే ఎలా.ఇది అర్జెంటు కేసు కాదు, మర్డర్ కేసులకే సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.