English | Telugu
కుర్ర హీరో..సినిమా హద్దులు చెరిపేస్తున్నాడట!!
Updated : Nov 21, 2015
రాజ్ తరుణ్ నటించిన కుమారి 21ఎఫ్ సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకు ఓ సవాల్ విసిరాడు. తెలుగు సినిమా హద్దులు చెరిపేస్తున్న రాజ్ తరుణ్ ను చూస్తే గర్వంగా ఉంది. ప్రతీ సన్నివేశంలో బాగా నటించాడు. ఇప్పటికీ మూస పద్దతిలోనే సినిమాలు చేస్తోన్న హీరోలందరూ రాజ్ తరుణ్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ముఖ్యంగా ప్రేక్షకులను ఇడియట్స్ గా భావించి సినిమాలు చేసే స్టార్ వారసులు అంతా మారాల్సిన తరుణం ఇది. బాహుబలి లాంటి భారీ చిత్రాలు లేదా కథాబలం ఉన్న భలే భలే మొగాడివోయ్, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయి. కథాబలం ఉంటే స్టార్ ఇమేజ్ సినిమాకు అవసరం లేదని చెప్పకనే చెప్పాడు. అయితే వర్మకు ఇలాంటి ట్విట్లు చేయడం కొత్తేమి కాదు. ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన కామెంట్లతో చెలరేగిపోవడం ఆయనకు అలవాటే.