English | Telugu

చెర్రీకి సుకుమార్ ఏ కథ చెప్పాడు..?

కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు రామ్ చరణ్. తను నమ్మి చేసిన కొన్న స్క్రిప్టులు దెబ్బ కొట్టడంతో, ఈ జాగ్రత్త ఇంకా పెరిగింది. అలాంటి చెర్రీకి, కథ చెప్పి సుకుమార్ ఓకే చేయించుకున్నాడని సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తని ఒరువన్ రీమేక్ తో బిజీగా ఉన్న చెర్రీ, దాని తర్వాత సుక్కుతో సినిమాను పట్టలెక్కించబోతున్నాడట.

సుక్కు రీసెంట్ కథల్ని చూస్తే, అన్నీ థ్రిల్లర్ జానర్ లో జరిగేవే కనిపిస్తాయి. సుక్కుభాయ్ కు వీటి మీద ఎందుకు ఇంట్రస్ట్ పెరిగిందో తెలియదు గానీ, హండ్రడ్ పర్సంట్ లవ్ తర్వాత నుంచీ పూర్తిగా థ్రిల్లర్ జానర్ లోనే మునిగి తేలుతున్నాడు. నేనొక్కడినే, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో..ఇలా వరసగా మూడింటినీ ఒకే జానర్ లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అలాగని లవ్ ను వదిలేయలేదు. థ్రిల్లర్ కు కొద్దిగా రొమాంటిక్ టచ్ కూడా ఇస్తున్నాడు. చెర్రీ ఇప్పటికే ఎవడుతో థ్రిల్లర్ టైప్ ప్రయోగం చేశాడు. మరి సుక్కూ భాయ్ థ్రిల్లర్ కథ చెప్పే చరణ్ ను ఒప్పించాడా..లేక ఆర్య, ఆర్య-2 లా విభిన్న ప్రేమకథను చెప్పాడా.. తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.