English | Telugu

సంపత్ నంది రచ్చ కథ బాగుంది- రామ్ చరణ్

"సంపత్ నంది "రచ్చ" కథ బాగుంది" అని రామ్ చరణ్ అన్నారట. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై, రామ్ చరణ్ తేజ హీరోగా, మిల్కీవైట్‍ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న అవుట్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "రచ్చ". ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ అమెరికా వెళ్ళి శరీర దారుఢ్యాన్ని మరింత మెరుగుపరచుకుని ఎయిట్ ప్యాక్ తో తిరిగొచ్చాడట హీరో రామ్ చరణ్.

ఈ "రచ్చ" సినిమా కథ తనకు చాలా బాగా నచ్చిందనీ, ఈ కథలో తన అభిమానులకు కావలసిన అన్ని మసాలాలూ ఉన్నాయనీ, వాళ్ళకి ఈ సినిమా పూర్తిగా సంతృప్తినిచ్చే రీతిలో ఉంటుందనీ హీరో రామ్ చరణ్ అన్నారు. "ఆరెంజ్" సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో నిరాశపడిన అభిమానులకు "రచ్చ" సినిమా కచ్చితంగా ఆ లోటుని పూడుస్తుందన్న నమ్మకంతో హీరో రామ్ చరణ్ ఉన్నాడు. ఈ సినిమాలో కథే కాకుండా అతని క్యారెక్టరైజేషన్ కూడా చాలా విభిన్నశైలిలో సాగుతుందని వినికిడి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.