English | Telugu

ఈ టైటిళ్లు సెట్ట‌య్యాయా??

వ‌రుస‌గా ముగ్గురు హీరోల సినిమాల పేర్లు క‌న్‌ఫామ్ అయిపోయాయి. రామ్‌చ‌ర‌ణ్ సినిమాకి అంద‌రూ అనుకొంటున్న‌ట్టే బ్రూస్ లీ అని పేరు పెట్టారు. అఖిల్ సినిమా పేరు చివ‌రాఖ‌రికి అఖిల్ అయ్యింది. నాగ‌చైత‌న్య - గౌత‌మ్ మీన‌న్ సినిమాకి సాహ‌స‌మే శ్వాస‌గా సాగిపో అని ఫిక్స్ చేశారు. అయితే ఈ టైటిళ్ల‌పై మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుండ‌డం చిత్ర‌బృందాల్ని గంద‌ర‌గోళంలో ప‌డేస్తోంది.

బ్రూస్ లీ అనే పేరు అంద‌రూ ఊహించిన‌దే అయినా... టైటిల్ పూర్తిగా ఇంగ్లీష్ వాస‌న కొడుతోంద‌ని, ఇలాంటి టైటిల్స్ పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేట‌ర్ల‌కు ఎలా వ‌స్తార‌ని మెగా ఫ్యాన్సే కాస్త ఆందోళ‌న ప‌డుతున్నారు. మైనేమ్ ఈజ్ రాజు, విజేత‌.. ఈ రెండు టైటిళ్ల‌లో ఏదో ఒక‌టి సెట్ చేస్తే బాగుండేద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌రోవైపు అఖిల్ టైటిల్‌కీ ఇదే రెస్పాన్స్‌. త‌మ హీరో పేరే పెట్టినా, టైటిల్‌లో అంత కిక్ లేద‌ని, ముందు నుంచీ అనుకొంటున్న‌ మిస్సైల్ పేరు ఫైన‌ల్ చేస్తే బాగుండేద‌ని అక్కినేని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.

ఇక నాగ‌చైత‌న్య టైటిల్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో ప‌రిస్థితీ ఇంతే. టైటిల్ లెంగ్తీగా ఉంద‌ని, పాట‌లా పాడుకోవ‌డానికి బాగుంటుంది గానీ, టైటిల్‌కి మాత్రం ఈ పేరు సెట్ట‌వ్వ‌లేద‌ని వాళ్లు వాపోతున్నార‌ట‌. తిన‌గా తిన‌గా వేమ తియ్య‌నుండు అన్న‌ట్టుగా విన‌గా విన‌గా ఈ టైటిళ్లు సెట్ట‌వుతాయేమో చూడాలి మ‌రి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.