English | Telugu

తొలి మెగా 'హీరోయిన్' వ‌స్తోంది!

మెగా ఇంట్లోంచి హీరోలు చాలామంది వ‌చ్చారు... వ‌స్తూనే ఉన్నారు. చిరంజీవి నుంచి మొద‌లైన ఆ ప్ర‌స్థానం, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ, వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, అల్లు శిరీష్ - ఇలా అప్ర‌హిహాతంగా కొన‌సాగుతూనే ఉంది. అయితే ఆ ఇంటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ మాత్రం రాలేదు. ఆలోటు తీర్చ‌బోంది నీహారిక.

నాగ‌బాబు త‌న‌య‌... నిహారిక ప్ర‌స్తుతం ఈటీవీ నిర్వ‌హిస్తున్న ఓ రియాలిటీ షోకి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. నిహారిక‌ని హీరోయిన్‌గా చేయాల‌న్న‌ది నాగ‌బాబు కోరిక‌. దానికి త‌గ్గ‌ట్టు.. వెండి తెర‌పై అడుగుపెట్టాల‌ని నిహారిక కూడా గ‌ట్టిగా కృషి చేస్తోంద‌ట‌. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ `సినిమాల్లో న‌టిస్తావా నిహారికా` అని అడిగితే ` ఆ ఉద్దేశం లేద‌`ని చెప్పిన ఈ అమ్మాయి ఇప్పుడు స‌డ‌న్ గా రూటు మార్చింది. `మా ఇంట్లో సినిమా వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. చిన్న‌ప్ప‌టి నుంచీ ఆ వాతావ‌ర‌ణంలోనే పెరిగా. నాకూ.. ఆ గాలి సోకింది` అంటూ స‌మాధానం ఇస్తోంది.

నిహారిక కోసం కొంత‌మంది ద‌ర్శ‌కులు ఇప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశారు. నాగ‌బాబు కూడా నిహారిక ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టార‌ట‌. ఓ క్రేజీ సినిమాతో నిహారిక‌ను లాంఛ్ చేయాల‌ని నాగ‌బాబు డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇంకేముంది?? తొలి మెగా హీరోయిన్‌గా నిహారిక త్వ‌ర‌లోనే వెండితెర‌పై చూడ‌డానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న‌మాట‌.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .