English | Telugu
కబాలి టీజర్ రిలీజ్ ఫిక్సయింది
Updated : Mar 6, 2016
రజనీ సినిమా అంటేనే ఒక సెన్సేషన్. ముందు సినిమాల ఫలితాలకు అతీతంగా ఆయన సినిమాలకు క్రేజ్ ఉంటుంది. త్వరలో రాబోతున్న కబాలీ గురించి కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన మూవీ టీం, తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఫిబ్రవరి మార్చి అంటూ చాలా కాలంగా, కబాలీ టీజర్ గురించి ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా మూవీ టీం టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలోనే సినిమా టీజర్ రిలీజ్ చేయబోతన్నామని దర్శకనిర్మాలు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న కబాలీ స్టిల్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.