English | Telugu

కన్నప్ప సినిమా చూసి రజినీకాంత్ రియాక్షన్!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న కన్నప్పపై విష్ణు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా కన్నప్ప సినిమాని రజినీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. "రజినీకాంత్ అంకుల్ కన్నప్ప సినిమా చూశారు. ఆ తర్వాత.. నాకు టైట్ హగ్ ఇచ్చి, సినిమా నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఆ హగ్ కోసం నేను 22 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది." అని విష్ణు రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా రజినీకాంత్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.