English | Telugu

లింగా ట్రైలర్‌.. ఏముంది ఇందులో?

ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా లింగా ట్రైట‌ర్ విడుద‌లై మూడు రోజులైంది. ఇప్ప‌టికే యూ ట్యూబ్‌లో 13 ల‌క్ష‌ల‌కు పైగా హిట్స్ వ‌చ్చాయి. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌ల‌లో లింగా ట్రైట‌ర్ గురించే చ‌ర్చంతా. ఫ్యాన్స్ క్లిక్కుల మీద క్లిక్కులు కొడుతున్నారు. లింగా ట్రైల‌ర్ చూశారా అంటూ షేర్లు చేసుకొంటున్నారు. అన్ని లింకులూ గ‌ల‌గ‌లిపి దాదాపు 25 ల‌క్ష‌ల హిట్స్ ఈ టీజ‌ర్ కివ‌చ్చాయి. ఐనా ఏముంది ఇందులో...?? నిండా ఒక్క నిమిషం కూడా లేని ఈ టీజ‌ర్లో విష‌యం ఏముంద‌ని ఇన్ని లైకులు, ఇన్ని హిట్సూ, ఇన్ని కామెంట్లూ...?? ఒక్క డైలాగ్ లేదు.
ర‌జ‌నీ స్టైల్ కూసింత కూడా క‌నిపించ‌లేదు.
అటు అనుష్క‌, ఇటు సోనాక్షి ఇద్ద‌రున్నా ఒక్క‌రి క‌టౌట్ కూడా కంటికి ఆన‌లేదు.
రెహ‌మాన్ బాషా బాషా టైపులో లింగా లింగా అంటూ కోర‌స్ పాడించాడు త‌ప్ప మెరుపుల్లేవు
కొడితే దుమ్ము రేగిపోవ‌డాలూ, గోడ‌లు బ‌ద్ద‌లైపోవ‌డాలూ లేవు. ఏముంది ఇందులో..?
ర‌జ‌నీ మాయ త‌ప్ప ఇంకేం లేవు. ర‌జ‌నీ బొమ్మ ఉందా, లేదా అనేదే ఫ్యాన్స్‌కి కావాలి. రెండు సెక‌న్ల పాటు న‌డిచొస్తే చాల‌నుకొంటారు. ర‌జ‌నీ నీడ క‌నిపించినా ఉబ్బిత‌బ్బుబ్బి అయిపోతారు. లింగా టీజ‌ర్లో ఇవే ఉన్నాయ్‌. సో... ఫ్యాన్స్ కి ఇంత‌కంటే ఏం కావాలి? ఒక్క డైలాగూ పేల్చ‌కుండానే టీజ‌ర్ కిక్కిస్తుంటే, సినిమా ని ఇంకెంత పిచ్చ‌పిచ్చ‌గా చూసేస్తారో.? ఏది ఏమైనా ర‌జ‌నీ మానియాకు మ‌రోసారి అద్దం ప‌ట్టింది లింగా టీజ‌ర్‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.