English | Telugu

రాజ‌శేఖ‌ర్ బాంబు పేల్చ‌నున్నాడా?

రాజ‌శేఖ‌ర్ భ‌లే మాట‌కారి. ఉన్న‌ది ఉన్న‌ట్టు స్వ‌చ్ఛంగా మాట్లాడేస్తారు. ఆయ‌న తెలుగు యాస‌, గుండెల్లోతుల్లోంచి మాట్లాడే విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. సినీ జీవితంలో ఆయ‌న ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్నీ ఇన్నీ కావు. హిట్స్‌, అట్ట‌ర్ ఫ్లాప్స్‌... ఇలా అన్నీ చూశారు. అందుకే.. ప‌రిస్థితుల‌కు ధీటుగా స్పందించ‌డం, ఎలాంటి క్లిష్ట‌మైన స్థితి నుంచైనా బ‌య‌ట‌కు రావ‌డం అల‌వాటు చేసుకొన్నారు. ఇటీవ‌ల ఆయ‌న జీవితంలో భ‌యంక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ట‌. అవేంటో త్వ‌ర‌లో చెబుతా అంటున్నారు.. ''మొన్న విశాఖ‌కు హుద్ హుద్ వ‌చ్చింది. దానికంటే పెద్ద హుద్ హుద్ నా జీవితానికి వ‌చ్చింది. అదేంటో ఇప్పుడు చెప్ప‌ను. 'గడ్డం గ్యాంగ్‌' విడుద‌ల‌య్యాక మాట్లాడుకొందాం'' అంటున్నారాయ‌న‌. మ‌రి రాజ‌శేఖ‌ర్ ఎదుర్కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితులేంటో.. ?? ఆయ‌న జీవితం గురించి చెప్తారా, లేదంటే.... కొంత‌మంది సినీ పెద్ద‌ల్ని టార్గెట్ చేస్తూ ఏదైనా సంచ‌ల‌న విష‌యాలు మాట్లాడ‌తారా? రాజ‌శేఖ‌ర్ ఏం చెబుతారు? ఆయ‌న పేల్చ‌బోయే బాంబు కెపాసిటీ ఎంత‌? అనే విష‌యాల గురించి చిత్ర‌సీమ‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. చిరు ఫ్యామిలీకీ, రాజ‌శేఖ‌ర్‌కీ కోల్డ్ వార్ జ‌రుగుతోంది అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ బాంబు కూడా చిరుపైనేనా...?? అన్న‌ది తేలాల్సివుంది.