Read more!

English | Telugu

నాగార్జున చిత్రంలో భూదేవిగా పావని గంగిరెడ్డి!

మన తెలుగు సినిమాల్లో తెలుగు నటీమణులు కనిపించరని అప్పుడప్పుడూ మన దర్శకనిర్మాతలతోపాటు.. తెలుగు ప్రేక్షకులు కూడా బాధపడుతూ ఉంటారు. ఆ లోటును తీరుస్తోంది పదహారణాల తెలుగు ఆడపడుచు పావని గంగిరెడ్డి. మోతాదు మించకుండా గ్లామర్ తో ఆకట్టుకొంటూనే.. నటనతోనూ అలరిస్తోంది. ఇటీవల "రైట్ రైట్" సినిమాలో మంచి నటనతో ఆకట్టుకొంది. ఈ అమ్మడు తాజాగా ఓ భారీ చిత్రంలో నటించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొంది. నాగార్జున ముఖ్యపాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిననున్న "ఓం నమో వెంకటేశాయా" చిత్రంలో "భూదేవి" పాత్ర కోసం పావని గంగిరెడ్డిని సంప్రదించారట. ఫోటోషూట్ కూడా చేసేశారట, సదరు పాత్రలో పావని ఇమిడిపోవడంతో.. సెకండ్ థాట్ లేకుండా ఆమెను భూదేవిగా సెలెక్ట్ చేసేశారట. పావని ఇదే విధంగా మరిన్ని మంచి పాత్రలతో తెలుగువారిని అలరించాలని ఆకాంక్షిద్దాం!