English | Telugu

రాజ‌మౌళీ... ఏముంద‌బ్బా గొప్ప‌?

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎప్పుడూ ఆహా.. ఓహో అనే సినిమాలే తీశాడు. నో డౌట్‌... హీ ఈజ్ ఏ క్రియేట‌ర్‌. తాజాగా అత‌న్నుంచి స్పిరిట్ ఆఫ్ దీపావ‌ళి అనే కాన్సెప్ట్‌తో ఓ ల‌ఘు చిత్రం వ‌చ్చింది. హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకోండి - అందులోనే దీపావ‌ళి వెలుగుల్ని చూడండి అనేది రాజ‌మౌళి చెప్పాల‌నుకొన్న పాయింట్‌. ల‌ఘు చిత్రంలో అది బాగానే క్యారీ అయ్యింద‌నుకోండి. ఇంత‌కీ ఆ కాన్సెప్ట్ మాత్ర‌మే రాజ‌మౌళిది. తీసింది - చేసిందీ రాజీవ్ మీన‌న్ అండ్ కో. అయితే ఇందుకు సంబంధించి ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఎక్క‌డా గౌత‌మ్ మీన‌న్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. అంతా నేనే చేశానన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పోనీ కాన్సెప్ట్ రాజ‌మౌళి ది కాబ‌ట్టి క్రెడిట్ కూడా ఆయ‌న‌దే అనుకోవ‌చ్చు. కానీ ఆ పాయింట్ కొత్త‌గా ఏం అనిపించడం లేదు. ఈమ‌ధ్య సుకుమార్ ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఐ యామ్ ద‌ట్ ఛేంజ్ పేరుతో. రాజ‌మౌళి కూడా దాదాపుగా అదే స్ర్కీన్ ప్లేని ఫాలో అయిపోయాడు. తుఫాను బాధుతుల‌ను ఆదుకోండి అన్న పాయింట్ అయితే అంద‌రికీ చేరువైంది... ఆ విష‌యంలో రాజ‌మౌళిని మెచ్చుకోవాలి. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ తీసిచ్చిన రాజీవ్ మీన‌న్‌కి క్రెడిట్ ఇవ్వ‌క‌పోవ‌డం మాత్రం స‌మంజ‌సంగా అనిపించ‌డం లేదు. తార‌లంతా త‌లో చేయీ వేసి హుద్ హుద్ బాధితుల‌ను ఆదుకొంటుంటే.. రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్‌తో స‌రిపెట్ట‌డం కూడా ఏం బాలేదు. త‌న వంతుగా ఏమిచ్చాడో చెబితే.. మిగిలిన‌వాళ్ల‌కూ ఆద‌ర్శంగా ఉండేది క‌దా.. అన్న‌ది జ‌నాల పాయింట్ ఆఫ్ వ్యూ. మ‌రి జ‌క్క‌న్న ఏమంటాడో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.