Read more!

English | Telugu

యంగ్ హీరో కెరీర్ కరాబావ్వడానికి కారకుడతడే!

"ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21F" సినిమాతో యువకథానాయకుడిగా రాజ్ తరుణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడంతో.. తెలుగు చిత్రసీమలో ఇతగాడు మరో ధృవతార అనుకొన్నారందరూ. అయితే.. ఊహించినట్లుగానే రాజ్ తరుణ్ నాలుగో చిత్రం "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" డిజాస్టర్ అయ్యింది. దాంతో మనోడి స్పీడ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత మంచు విష్ణుతో స్క్రీన్ షేర్ చేసుకొని నటించిన "ఈడోరకం ఆడోరకం" హిట్ అయినప్పటికీ.. అదోరకరం సినిమా కావడంతో ఆ సక్సెస్ క్రెడిట్ మనోడి ఖాతాలో పడలేదు. ఆ తర్వాత తన ఇన్వాల్వ్ మెంట్ కారణంగా మూడు సినిమాలు పోగొట్టుకొన్నాడు.

ఆ తరువాత కొన్నాళ్ళ గ్యాప్ తీసుకొని "ఎ.కె ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి అంగీకరించి అందుకు ప్రతిఫలంగా ఓ కాస్ట్లీ విల్లా ఒకటి సొంతం చేసుకొన్నాడు. ఈ ఆఫర్ చెప్పుకోవడానికి బాగానే ఉన్నప్పటికీ.. రాజ్ తరుణ్ కెరీర్ ను మాత్రం ఇది బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. అయితే.. ఈ ప్లానింగ్ అంతా రాజ్ తరుణ్ ది కాదని, అతడి డేట్స్ ను మేనేజ్ చేస్తున్న నటుడు రాజారవీంద్రదని తెలుస్తోంది. రాజారావీంద్ర ప్లానింగ్ కారణంగా రాజ్ తరుణ్ కెరీర్ త్వరలోనే కష్టాల్లో పడడం ఖాయమని కొందరు ఇండస్ట్రీ పెద్దలు రాజ్ తరుణ్ కి హితబోధ చేస్తున్నారు!