Read more!

English | Telugu

రాజమౌళి కూడా ఆ వేషం వేద్దామనుకొన్నాడు!

ప్రస్తుతం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా, ఆర్ట్ డైరెక్టర్లుగా, సెట్ అసిస్టెంట్స్.. ఇలా ప్రతి శాఖలో పనిచేస్తున్నవారందరూ తొలుత ఇండస్ట్రీలో హీరోనా, విలనా అన్న సంగతి పక్కనపెట్టేస్తే ఆర్టిస్ట్ అవుదామని వచ్చినవారే. కానీ.. అవకాశం రాక, తిరిగితిరిగి అలిసిపోయో.. పొట్టకూటి కోసం దొరికిన పనిచేస్తూ బతుకుబండిని లాగించేస్తున్నారు. ఇందుకు దర్శకధీరుడిగా ఖ్యాతి గాంచిన రాజమౌళి కూడా ఇందుకు అతీతుడు కాడట. ఈ విషయాన్ని నిన్న జరిగిన "షో టైమ్" అనే ఆడియో వేడుకలో వెల్లడించాడు. మొదట్లో రాజమౌళి హీరో అవుదామనుకొన్నప్పుడు తన అన్నయ్య ఎస్.ఎస్.కాంచి చాలా సపోర్ట్ చేశాడట. అందుకే రాజమౌళికి కాంచి అంటే అమితమైన అభిమానం. అందుకే అతడ్ని రచయితగా "మర్యాద రామన్న" చిత్రంతో పాపులర్ చేశాడు, ఇప్పుడు దర్శకుడిగా మారి తెరకెక్కించిన "షో టైమ్" చిత్రానికి పూర్తి సపోర్ట్ ను అందిస్తున్నాడు. సో, రాజమౌళి కూడా హీరో అవుదామని అనుకొన్నవాడేనన్నమాట. అవ్వలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే మనం ఆయన సినిమాలను మిస్ అవ్వాల్సి వచ్చేది!