Read more!

English | Telugu

ఎన్టీయార్, పవన్ కళ్యాణ్ ల వరుసలో నాని!

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ఆరంభించిన నాని ఇప్పుడు స్టార్ కథానాయకుడిగా ఎదిగిన వైనం చాలా మందికి ఆదర్శనీయం. మొదట్లో తడబడినప్పటికీ.. వరుస విజయాలతో ఫామ్ లోకి వచ్చాడు నాని. ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. ఇటీవల విడుదలైన "జెంటిల్ మెన్" చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని యువ కథానాయకుల జాబితాలో లో అగ్ర స్థానాన్ని దక్కించుకొన్నాడు. నాని మునుపటి చిత్రం "భలే భలే మగాడివోయ్" ఓవర్సీస్ లో ఘనమైన కలెక్షన్లు సొంతం చేసుకొని అందరి మతులు పోగొట్టింది. ఇప్పుడు అతగాడి తాజా చిత్రం "జెంటిల్ మెన్" కూడా అదే తరహాలో ప్రయాణిస్తోంది. ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇంకో 400 డాలర్లు వసూలు చేస్తే.. పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది", ఎన్టీయార్ "నాన్నకు ప్రేమతో" చిత్రాల వరుసలో చేరిపోతుంది. దాంతో.. నాని ఓవర్సీస్ మార్కెట్ లో పవన్ కళ్యాణ్, ఎన్టీయార్ వంటి అగ్రకథానాయకుల సరసన సగర్వంగా నిలుస్తాడన్నమాట!