English | Telugu

రాశీ ఖన్నా పెంచేసింది!

రాశీ ఖన్నా చాలా పెంచేసిందట. ఏంటి ఒళ్లా? సాధారణంగానే బొద్దుగుమ్మ...ఇంకా పెంచేదేముంది?కొంపతీసి నమిత చెల్లెలిలా తయారైందా అని అంటారా? మీరు అపార్థం చేసుకోకండీ బాబూ....రాశీ పెంచేసింది ఒళ్లు కాదు....రెమ్యునరేషన్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఇలా వచ్చారో లేదో ఒక్క హిట్ పడగానే టాప్ స్టార్ అయిపోయినట్టు ఫీలవుతున్నారు నేటి ముద్దుగుమ్మలు. ఊహలు గుసగుసలాడే బాగుందనిపించింది..జిల్ లో అందాలారబోసి, మూతిముద్దుల్లో రెచ్చిపోయి దేనికైనా రెడీ అనే సిగ్నల్ ఇచ్చింది. దీంతో అమ్మడి వెనుక దర్శకనిర్మాతల క్యూ పెరిగింది. దీంతో ఇదే మంచి ఛాన్స్ అనుకుందో ఏమో 50లక్షలిస్తేనే రండి అంటూ సిగ్నల్స్ పంపిస్తోందట. ఫుల్ గా ఫామ్ లోకి రాకముందే 50అంటోంది.....తీరా మరో రెండు సినిమాలు హిట్టైతే డబుల్ చేస్తుందేమో? మరి రాశీఖన్నా భారాన్ని ఎవరు మోస్తారో ఏమో.....!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.