English | Telugu

పూరీ, మహేశ్ "జణ గణ మన" అసలు పట్టాలెక్కుతుందా..? మహేశ్ మౌనం ఎందుకు..?

పూరీ జగన్నాథ్, మహేశ్ హీరోగా 2006లో వచ్చిన "పోకిరి" సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబులో ఉన్న మరో యాంగిల్ ను బయటకి తీసి చూపించాడు పూరీ. దాని తరువాత వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన "బిజినెస్ మాన్" సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పూరీ, మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా "జణ గణ మన". అయితే అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినంత వరకూ ఈ సినిమా గురించిన ఎలాంటి టాక్ వినిపించలేదు. అయితే పూరీ రీలిజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మాత్రం రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ ఊపుతోనే మహేష్ తో "జణ గణ మన" అనే సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేసేసాడు పూరీ.


కానీ మహేశ్ బాబు మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం అది నిజమో.. కాదో కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రస్తుతం మహేశ్ బ్రహ్మోత్సవం సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆతరువాత వెంటనే మురగదాస్ సినిమాకి కమిట్ అయ్యాడు. తెలుగు - తమిళ్ ల లో ద్విభాషా చిత్రంగా గా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమా అయ్యి పూరీ సినిమా పట్టాలెక్కాలంటే కనీసం రెండు సంవత్సరాలైనా పడుతోంది. ఇక మహేశ్ కూడా ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ ఏం మాట్లాడలేదు. అంతేకాదు మహేష్ నుంచి ఏదైనా ప్రకటన వస్తే కానీ నమ్మలేం అని అనుకుంటున్నారు కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.