English | Telugu

ఛార్మితో పూరికి ప‌నిలేదిక‌!

జ్యోతిల‌క్ష్మి ఎప్పుడు మొద‌లైందో అప్ప‌టి నుంచీ.. ఛార్మీకి పూరి జ‌గ‌న్నాథ్‌కీ మ‌ధ్య ఎఫైర్ ఉంద‌న్న గుస‌గుస‌లూ మొద‌లైపోయాయి. పూరి ఎక్క‌డున్నా ఛార్మి కూడా అక్క‌డే ప్ర‌త్య‌క్షం అవ్వ‌డం, జ్యోతిల‌క్ష్మి చిత్రంలో ఛార్మినీ పూరి ఓ పార్ట‌న‌ర్‌గా తీసుకోవ‌డంతో ఈ వ‌దంతుల‌కు ప్రాణం వచ్చిన‌ట్టైంది.

ఛార్మి కూడా పూరి ఆఫీసులోనే మ‌కాం పెట్టేయ‌డంతో.. ఈ ఎఫైర్‌ ఓపెన్ సీక్రెట్ అనే రేంజులో ప్ర‌చారం సాగింది. చార్మి వ‌ల్లే పూరి - నితిన్ ల సినిమా ఆగిపోయింద‌ని, వ‌రుణ్‌తేజ్ సినిమాకీ ఛార్మినే కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని గుస‌గుస‌లాడుకొన్నారు. అయితే వీట‌న్నింటికీ చెక్ పెట్టాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. ఇక మీద‌ట త‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లోగానీ, ఆఫీసు విష‌యాల్లో గానీ ఛార్మిని దూరంగా పెట్టాల‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. అందుకే వ‌రుణ్ తేజ్ సినిమా విష‌యంలో ఛార్మిని దూరంగా ఉండాల‌ని సూచించ‌డాట‌.

ఛార్మి కూడా పూరి ఆఫీసు ఖాళీ చేసి... త‌న అపార్ట్‌మెంట్‌కి షిష్ట్ అయిపోయిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. జ్యోతిల‌క్ష్మి ముగిశాక కూడా పూరి - ఛార్మి ల‌మ‌ధ్య సంబంధాలు బాగానే ఉన్నాయ‌ని, నితిన్ వ్య‌వ‌హారం తెర‌పై కొచ్చాక‌...పూరి ఛార్మిని దూరం పెట్టాల‌ని డిసైడ్ అయ్యాడ‌ని తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.