Read more!

English | Telugu

బాలయ్యను టార్గెట్ చేస్తున్నారెందుకు??

నిన్న విడుదలైన "జక్కన్న" ఆడియో సునీల్ మునుపటి సినిమాలు "అందాల రాముడు, పూల రంగడు" తరహాలోనే ఎంటర్ టైనింగ్ గా ఉంది. సునీల్ కామెడీ టైమింగ్, సప్తగిరి వెకిలి చేష్టలతోపాటు జనాలని బాగా ఆకట్టుకొన్న అంశం ఈ సినిమాలో మరొకటి ఉంది. అదే 30 పృధ్వీ పోలీస్ గెటప్ లో చెప్పిన పంచ్ డైలాగులు. "సింహా" సినిమాలో బాలయ్య గెటప్ ను కాపీ కొట్టడమే కాకుండా.. పృధ్వీ చేత ఆ తరహా డైలాగులు కూడా చెప్పించారు. "ఒక్కసారి నేను సీన్ లోకి ఎంటరయ్యాక.. రాసిన రైటర్ కే డైలాగులుండవ్" అంటూ పృధ్వీ చెప్పిన డైలాగ్ బాలయ్య శైలిని తలపించడంతోపాటు ఆయన వ్యవహార శైలిని కూడా ప్రతిబింబించింది. దాంతో కావాలనే బాలయ్యను ఈ విధంగా డీగ్రేడ్ చేస్తున్నారంటూ నందమూరి అభిమానులు ఆన్ లైన్ లో సునీల్ పై నిప్పులు రువ్వుతున్నారు. మరి ఈ విషయంలో సునీల్ ఎలా స్పందిస్తాడో చూడాలి!