Read more!

English | Telugu

"ఒక మనసు" వల్ల నష్టాలు...?

దర్శకుడిగా మధుర శ్రీధర్ రెడ్డికి పరిచయ చిత్రం "స్నేహగీతం" తప్పితే మరో చెప్పుకోదగ్గ సినిమా లేదు. ఆ తర్వాత నిర్మాతగా మారి రూపొందించిన "మాయ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్" సినిమాలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. ఆయన నిర్మించిన "ఒక మనసు" నిన్న విడుదలై మిక్స్డ్ టాక్ దక్కించుకొంది. అయితే.. విడుదలకు ముందే "ఒక మనసు" మధుర శ్రీధర్ రెడ్డికి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని వినికిడి, మెగా తనయ హీరోయిన్ గా పరిచయమవుతుండడంతో అన్నీ ఏరియాల నుంచి మంచి ఆఫర్లే వచ్చాయి. తీరా నిన్న విడుదలయ్యాక సినిమా బాగా సాగదీసినట్లుగా ఉండడంతో ప్రేక్షకుల బాగా నీరసపడ్డారు. వెంటనే చిత్ర బృందం ఓ 14 నిమిషాల నిడివిని తోలగించారనుకోండి. అయినా డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమా నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉండని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి మధుర శ్రీధర్ రెడ్డి ఈ విషయాన్ని గమనించి ఆ నష్టాల గురించి ఏమైనా పట్టించుకొంటారో లేదో చూడాలి!