Read more!

English | Telugu

"చంద్రముఖి 2"లో లేడీ బాక్సర్!

"సాలా ఖద్దూస్" సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాక్సర్ రితికా సింగ్, ఇక తన బాక్సింగ్ కెరీర్ ను పక్కనపెట్టి సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని ఫిక్సయ్యింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత లారెన్స్ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాలోనూ రితికాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కన్నడలో ఘన విజయం సొంతం చేసుకొని వందరోజులపాటు నడిచిన "శివలింగ" సినిమాను తమిళంలో పి.వాసు రీమేక్ చేయనున్నారు. శివరాజ్ కుమార్ పాత్రను లారెన్స్ పోషించనుండగా.. అక్కడ వేదిక నటించిన క్యారెక్టర్ ను తమిళంలో రితికా సింగ్ చేయనుంది. ఇకపోతే.. తెలుగులోనూ వెంకటేష్ హీరోగా సుధా కొంగర తెరకెక్కించనున్న "సాలా ఖద్దూస్" తెలుగు రీమేక్ లోనూ రితికా నటించనుందని తెలుస్తోంది!