English | Telugu

ఫ్యాన్స్ దెబ్బకి 'ప్రాజెక్ట్ k' ఫస్ట్ లుక్ మార్చేసిన మేకర్స్!

'బాహుబలి'తో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలు అంచనాలను అందుకోలేక నిరాశపరుస్తున్నాయి. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాలు విడుదల కాగా, అన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రాలు 'సలార్', 'ప్రాజెక్ట్ k' పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'ప్రాజెక్ట్ k' పాన్ వరల్డ్ మూవీగా ప్రచారం పొందింది. కానీ తాజాగా 'ప్రాజెక్ట్ k' నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ ని దారుణంగా నిరాశపరిచింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్ k'. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దీపికా పదుకొణె ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 21 ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీపిక ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, నిన్న(జూలై 19) ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. మార్ఫ్ డ్ ఫొటోలా, ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరైతే సూపర్ హీరో బాడీకి ప్రభాస్ ఫేస్ ని అతికించినట్లు ఉందని కూడా కామెంట్స్ చేశారు. దీంతో వైజయంతీ మూవీస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తొలగించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. పాత పోస్టర్ తో పోలిస్తే కొత్త పోస్టర్ చాలా మెరుగ్గా ఉంది. ఇప్పుడు మార్ఫ్ డ్ ఫొటోలా కాకుండా, నిజంగానే ప్రభాస్ సూపర్ హీరోలా కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక నుంచైనా పోస్టర్స్ ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే మంచిందని ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.