English | Telugu

బాలకృష్ణ అభిమానులకి క్షమాపణలు 

ఎన్ బికె 109(nbk 109)పేరుతో తెరకెక్కుతున్న బాలకృష్ణ(balakrishna)కొత్త మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటకే కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్నఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది.ఇప్పటికే రిలీజ్ అయిన బాలకృష్ణ క్యారక్టర్ తాలూకు టీజర్ సోషల్ మీడియాలో హయ్యెస్ట్ వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

దీపావళి కి టైటిల్ టీజర్ ని రిలీజ్ చేస్తామని సితార సంస్థ గతంలో తెలిపింది.ఇప్పుడు ఈ విషయంపై ఆ సంస్థ అధినేత నాగ వంశీ మాట్లాడుతు బాలకృష్ణ గారి కొత్త సినిమా టైటిల్ ని విజువల్ తో అనౌన్స్ చేద్దామని అనుకున్నాం.ఎందుకంటే పోస్టర్స్ తోచెప్తే ఆ కిక్ రాదు. ఆ విజువల్ కి చాలా సిజీ పార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది.కానీ సిజీ వర్క్ టైం కి డెలివరీ అవ్వలేదు. అందుకనే ఈ దీపావళి కి డెలివరీ ఇవ్వలేకపోతున్నాం. బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఈ విషయంలో సారీ చెప్తున్నాను అని తెలిపాడు.

చిరంజీవి(chiranjeevi)కి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ ని అందించిన బాబీ(bobby)దర్శకుడు కావడంతో బాలయ్య అభిమానుల్లో ఎన్ బి కె 109 పై భారీ అంచనాలే ఉన్నాయి. వాల్తేరు వీరయ్య లోనే చిరంజీవి తో కలిసి ఒక ఐటెం సాంగ్ లో చిందులేసిన ఊర్వశి రౌతేలా ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి గతంలో అధికార ప్రకటన కూడా వచ్చింది. శ్రద్ద శ్రీనాధ్ మెయిన్ హీరోయిన్ గా చెయ్యబోతుందనే వార్తలు అయితే వినపడుతున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.