English | Telugu

దిల్‌రాజుకి పోలీసుల సంఘం నోటీసులు..!

ప్రముఖ నిర్మాత దిల్‌రాజుపై తెలంగాణ పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయింది. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ తేరి అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు రైట్స్ దిల్‌రాజు దక్కించుకున్నారు. పోలీసోడు అనే టైటిల్‌తో ఈ సినిమాను శ్రీరామనవమి కానుకగా రేపు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాని ఈ సినిమాకు పెట్టిన తెలుగు టైటిల్ పోలీసుల్ని అగౌవరపరిచేలా ఉందని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, నగర విభాగం అధ్యక్షుడు ఎన్.శంకర్ రెడ్డిలు దిల్‌రాజుకి నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసుపై దిల్‌రాజు ఇంకా స్పందించలేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.