English | Telugu

భారీ బడ్జెట్ తో తమ్ముడు.. దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా..?

భారీ బడ్జెట్ తో తమ్ముడు.. దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా..?

 

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ ఎక్కువసార్లు కరెక్ట్ అవుతుంటుంది. ఒక సినిమా పట్టాలెక్కించే ముందు ఆయన ఎన్నో లెక్కలేసుకుంటారు. అలాంటి దిల్ రాజు.. ప్రజెంట్ హీరో నితిన్ మార్కెట్ కి మించి 'తమ్ముడు' సినిమా కోసం ఖర్చు చేశారు. దీంతో దిల్ రాజు  రిస్క్ చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు దిల్ రాజు. (Dil Raju)

 

"ప్రేక్షకులకు థియేటర్లలో ఓ మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తమ్ముడు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశాము. బడ్జెట్ రూ.75 కోట్ల దాకా అవుతుంది. అయితే హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ తగ్గించుకోవడంతో రూ.67 కోట్లలో సినిమాని పూర్తి చేయగలిగాం. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.35 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.32 కోట్లు వస్తే సరిపోతుంది. తమ్ముడు సినిమా కొత్తగా ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది." అన్నారు.

 

దిల్ రాజు నిర్మించే సినిమాలు ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఉంటాయి. అలాంటిది తమ్ముడుకి సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావడంపై కూడా దిల్ రాజు స్పందించారు. "ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోయింది. అయితే ఎంటర్టైనర్ తీయాలి.. లేదంటే థియేటర్లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అందించాలి. తమ్ముడు అలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. సెకండాఫ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే సెన్సార్ A ఇచ్చింది. ఆ సన్నివేశాలను తగ్గిస్తే U/A ఇస్తామన్నారు. కానీ, ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము A తీసుకున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కువ శాతం ఫారెస్ట్ లో ఉంటుంది. ఒక మంచి అడ్వెంచర్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది." అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Interview link: Dil Raju Exclusive Interview