English | Telugu

తేజ సజ్జకి 6 కోట్లు బాకీ పడ్డ అశ్వనీదత్‌.. ఎలాగో తెలుసా?

కేవలం రెండు సినిమాలతో స్టార్‌ హీరో రేంజ్‌కి వెళ్లిపోయిన నటుడు తేజ సజ్జ. ఒక బాలనటుడు టాలీవుడ్‌లోని టాప్‌ హీరోల సరసన చేరడం అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. హనుమాన్‌, మిరాయ్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ని ఏర్పరుచుకున్న తేజ సజ్జ.. నటించిన తొలి సినిమా మెగాస్టార్‌ చిరంజీవి, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో సి.అశ్వనీదత్‌ నిర్మించిన ‘చూడాలని వుంది’. కేవలం రెండు సంవత్సరాల వయసులో కెమెరా ముందుకు వచ్చిన తేజ.. అప్పటి నుంచి పదేళ్ళపాటు బాలనటుడిగా దాదాపు 25 సినిమాల్లో నటించాడు.

ఆ తర్వాత పదేళ్లు గ్యాప్‌ తీసుకొని 2019లో ‘ఓ బేబీ’ చిత్రంలో ఒక యంగ్‌ క్యారెక్టర్‌ చేశాడు. 2021లో ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ‘జాంబిరెడ్డి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ చిత్రాలు చేసినప్పటికీ ఆశించిన రిజల్ట్‌ రాలేదు. ఆ తర్వాత చేసిన ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే చేసిన ‘హనుమాన్‌’, ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మిరాయ్‌’ చిత్రాలు ఒక్కసారిగా తేజను స్టార్‌గా నిలబెట్టాయి. ఇదిలా ఉంటే.. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్‌ అధినేత సి.అశ్వనీదత్‌.. తేజ సజ్జకి రూ.6 కోట్లు బాకీ పడ్డారన్న వార్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. జగపతిబాబు సారధ్యంలో నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దాని గురించి వివరించమని తేజ సజ్జని కోరారు జగపతిబాబు.

‘నేను మొదట చిరంజీవిగారితో చూడాలని వుంది చిత్రంలో నటించాను. ఆ సినిమాకి అశ్వనీదత్‌గారు ప్రొడ్యూసర్‌. అప్పటి నుంచి నన్ను ఆయన బాగా ప్రోత్సహించేవారు. వారి బేనర్‌లో నేను 5 సినిమాల్లో నటించాను. చిరంజీవిగారు, మహేష్‌గారు, పవన్‌కళ్యాణ్‌గారు, అల్లు అర్జున్‌గారు.. ఇలా అందరితో నటించే అవకాశం వచ్చింది. ఆ టైమ్‌లో అశ్వనీదత్‌గారు చెప్పిన మాటేమిటంటే.. ‘వీడు మన బేనర్‌లో చాలా సినిమాలు చేశాడు. అందుకే వీడి పేరు మీద 5లక్షలు మూచ్యువల్‌ ఫండ్‌ ఫిక్స్‌ చేస్తాను. వీడికి 25 ఏళ్లు వచ్చిన తర్వాత.. ఇది దత్‌ అంకుల్‌ ఇచ్చారని చెప్పి ఇవ్వండి’ అన్నారు. అది 6 కోట్లా, 8 కోట్లా అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. నాకు 25 పూర్తయి రెండు మూడు సంవత్సరాలవుతోంది. మరి ఆ మూచ్యువల్‌ ఫండ్‌ని బ్రేక్‌ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అయితే అది బ్రేక్‌ చేసినా నాకు ఆ అమౌంట్‌ అక్కర్లేదు. ఒక బ్లాక్‌బస్టర్‌ కథ ఇవ్వండి. స్వప్నగారికి స్టోరీలపై మంచి జడ్జిమెంట్‌ ఉంటుంది. అందుకే.. స్వప్న అక్కా.. నాకు మంచి కథ ఇవ్వు అక్కా చాలు’ అంటూ అశ్వనీదత్‌ బాకీ ఉన్న 6 కోట్ల గురించి వివరించారు తేజ సజ్జ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.