English | Telugu
నా బిడ్డ ఆత్మహత్యాయత్నం చేయలేదు-ప్రియాంక తల్లి
Updated : Apr 4, 2016
ప్రియాంక చోప్రా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిదంటూ ఆమె మాజీ మేనేజర్ ప్రకాశ్ జాజు వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రియాంక తల్లి మధు. తన బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్న వార్తలు పచ్చి ఆబద్ధమన్నారు. అయితే ప్రియాంక ఒకప్పటి ప్రియుడు అసీమ్ మర్చంట్ తల్లి చనిపోయినప్పుడు మాత్రం ప్రియాంక తీవ్ర మనోవేధనను అనుభవించిందని, తను తిరిగి మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టిందని మధు తెలిపారు. చిన్నారి పెళ్లికూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని విషాదంలో ముంచెత్తిన తరుణంలో ప్రియాంక చోప్రా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ ప్రకాశ్ జాజు చేసిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తతో బాలీవుడ్ ఉలిక్కిపడింది.