English | Telugu

ప్రకాష్ రాజ్ కు మళ్ళీ జాతీయ అవార్డ్

ప్రకాష్ రాజ్ కు మళ్ళీ జాతీయ అవార్డ్ లభించింది. వివరాల్లోకి వెళితే విలక్షణ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఎంతటి ప్రతిభ కలిగిన నటుడో మనందరికీ తెలిసిందే. "పుట్టక్కన హైవే" అనే కన్నడ సినిమాకు ఉత్తమ చిత్రంగా నిర్మాత ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నిర్మాత అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజే నిర్మించారు. ఈ జాతీయ అవార్డుని తన గురువు కె.బాలచందర్ "దాదాసాహెబ్ ఫాల్కే" అవార్డు అందుకోబోయే వేదిక నుంచే ప్రకాష్ రాజ్ కూడా అందుకోవటం విశేషం. గతంలో 2009వ సంవత్సరానికి గాను "కాంజీవరం" అనే సినిమాలో నటించినందుకు, ఇంకా 1998 వ సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "ఇరువర్" అనే సినిమాలో అత్యుత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డులు లభించాయి.

ప్రకాష్ రాజ్ వంటి అద్భుతమైన నటుడికి ఇలాంటి అవార్డులు గీటురాయి కాకపోయినా జాతీయ స్థాయిలో అవార్డు రావటం ప్రకాష్ రాజ్ లోని నటుడి దాహార్తిని, అలాగే మంచి అభిరుచి ఉన్ననిర్మాత తపనని కొంతవరకూ సేదతీరుస్తుంది.ప్రతిసారీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డునందుకునే ప్రకాష్ రాజ్ ఈసారి ఉత్తమ నిర్మాతగా జాతీయ అవార్డునందుకోబోతున్నారు. నటుడిగానైనా, నిర్మాతగానైనా ప్రకాష్ రాజ్ ఉత్తముడేగా. ఈ సందర్భంగా తెలుగువన్ ప్రకాష్ రాజ్ కు శుభాభినందనలు తెలియజేస్తోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.