English | Telugu

ఇదీ ‘కల్కి’ స్టోరీ.. రివీల్‌ చేసి షాక్‌ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘కల్కి 2898 ఎడి’. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో రూపొందని ఒక డిఫరెంట్‌ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. ‘సలార్‌’ వంటి భారీ హై ఓల్టేజ్‌ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ‘కల్కి’ ఎలాంటి సినిమా, దాని కథ ఏమిటి అనే విషయంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది.

సైన్స్‌, పురాణాలు వంటి అంశాలతో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పాడంటే.. ఈ సినిమా మహాభారతం నుంచి మొదలై 2898లో ముగుస్తుంది. అందుకే ‘కల్కి 2898ఎడి’ అనే టైటిల్‌ని పెట్టాం. ఈ సినిమా 6000 సంంత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్‌ చేసాం’ అంటూ వివరించాడు.

ఈ సినిమా కమల్‌హాసన్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్‌ బచ్చన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక రాజమౌళి, దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .