English | Telugu

ఎ.ఆర్‌.రెహమాన్‌కు ఊరట.. పొన్నియన్‌ సెల్వన్‌ కేసు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు!

1983లో విడుదలైన పల్లవి అను పల్లవి అనే కన్నడ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన మణిరత్నం.. ఆ తర్వాత చేసిన పది సినిమాలకు ఇళయరాజాతోనే మ్యూజిక్‌ చేయించుకున్నారు. 1992లో రూపొందిన ‘రోజా’ చిత్రం ద్వారా ఎ.ఆర్‌.రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు మణిరత్నం. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన దాదాపు 20 సినిమాలకు రెహమాన్‌తో తప్ప మరో సంగీత దర్శకుడ్ని అప్రోచ్‌ అవ్వలేదు. దానికి తగ్గట్టుగానే రెహమాన్‌ కూడా మణిరత్నం టేస్ట్‌కి తగ్గ సంగీతం అందిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 2023లో మణిరత్నం రూపొందించిన మల్టీస్టారర్‌ మూవీ ‘పొన్నియన్‌ సెల్వన్‌2’.. కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎ.ఆర్‌.రెహమాన్‌ కంపోజ్‌ చేసిన పాటలు కూడా చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలోని ‘వీరా రాజ వీరా..’ అనే పాటను తన తండ్రి ఫయాజుదీన్‌ డగర్‌, మామ జాహిరుదీన్‌ డగర్‌ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేశారని సింగర్‌ ఉస్తాద్‌ ఫయాజ్‌ వసీవుద్దీన డగర్‌ ఆరోపించారు. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఏప్రిల్‌లో ఈ కేసును విచారణకు తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. 2 కోట్ల రూపాయల జరిమానాతోపాటు సినిమాలో పిటిషన్‌ దారుడికి క్రెడిట్‌ ఇవ్వాలని ఎ.ఆర్‌.రెహమాన్‌ను, మద్రాస్‌ టాకీస్‌ నిర్మాణ సంస్థను ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రెహమాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి జరిగిన వాదోపవాదాల తర్వాత సెప్టెంబర్‌ 25న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎ.ఆర్‌.రెహమాన్‌కు ఊరట లభించింది. ‘వీరా రాజ వీరా’ పాటపై సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పాట ఫయాజుదీన్‌ డగర్‌, మామ జాహిరుదీన్‌ డగర్‌ కంపోజ్‌ చేసిన శివస్తుతి పాటను పోలి ఉందని గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును జస్టిస్‌ హరిశంకర్‌, జస్టిస్‌ ఓంప్రకాశ్‌ శుక్లాతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. ఎ.ఆర్‌.రెహమాన్‌పై పెట్టిన కేసును ధర్మాసనం కొట్టివేసింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.