English | Telugu

‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత సంగీత్‌ శోభన్‌తో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ సినిమా!

ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్‌ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావటం విశేషం.

తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రెండో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు మానసశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ప్రతిభావంతుడైన యువ కథానాయకుడు సంగీత్‌ శోభన్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్‌ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.

ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్‌ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్‌ శోభన్‌, డైరెక్టర్‌ మానసశర్మ భాగమయ్యారు. జీ5తో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానసశర్మ రచయితగా.. సోనీ లివ్‌ రూపొందించిన ‘బెంచ్‌ లైఫ్‌’కి దర్శకురాలిగా పనిచేశారు. తాజాగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ రూపొందించనున్న ఈ సినిమాతో మానసశర్మ ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక సంగీత్‌ శోభన్‌ విషయానికి వస్తే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రధాన పాత్రలో నటించారు.

ఈ చిత్రానికి మానసశర్మ కథను అందించగా, మహేష్‌ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించారు. మన్యం రమేష్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సురేంద్రకుమార్‌ నాయుడు, ఫణి కందుకూరి(బియాండ్‌ మీడియా) పీఆర్వోలుగా వ్యవహరిస్తుండగా, మార్కెటింగ్‌ వ్యవహారాలను టికెట్‌ ఫ్యాక్టరీ నిర్వహిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.